Proposed project - for 10 years - Reconstruction of the Ancient Chaturmukha Sri Swayambhooveshwara Devasthanam at a New Location, and Preserving Its Original Form:

The History of the Kakatiyas - Kakatiya Kingome ( 995 - 1323 )

  • India and Its Great Empires : From the very beginning of creation, by the grace of the Divine, the Indian subcontinent has witnessed the rise of countless great empires, whose glory reached the lofty heights of Mount Meru. The purpose and guiding principle behind the establishment of these magnificent kingdoms was the protection and preservation of Dharma.
  • Dharma was regarded as the highest and most important principle. Kings, emperors, and sovereign rulers, devoted to the worship of the Supreme Being and guided by learned teachers and scholars well-versed in the Vedas, followed the path of Dharma. They, in turn, guided their people to walk upon the same righteous path.

The Kakatiya Empire of Orugallu : In such a sacred land as India, in the southern region of the subcontinent, and by the divine grace of Sri Padmakshi Devi, Sri Rudra Shiva, Sri Varaha Devata, there arose, many centuries ago, the glorious Kakatiya Empire.

Glorious Kakatiya Empire( 995 - 1323 ) flourished 1158 CE, the city of Orugallu, renowned as the magnificent Ekashila Nagaram (City of the Single Stone), rose to prominence as a center of wealth, power, and culture. Thus flourished the glorious Kakatiya Empire, also known as the Great Kakatiya Kingdom of Orugallu.

కాకతీయుల చరిత్ర ( 995 - 1323 ) : భారత దేశము, మహాసామ్రాజ్యములు : సృష్టి ఆదినుంచి భరత ఖండము నందు భగవద్ కృపతో మేరుపర్వత శిఖర కీర్తులగన్న సామ్రజ్యములు అనంతములు మహాసామ్రా జ్యములు వాటి నిర్మాణములు లక్ష్యములు 'ధర్మ పరిరక్షణ' ధర్మమే ముఖ్య తత్వముగా ప్రభువులు, చక్రవర్తులు, సామ్రట్ లు భవగంతుని ఆరాధనలతో వేద విదులైన ఆచార్యుల మార్గదర్శనమున వారు ధర్మమార్గమున పయనిస్తూ ప్రజలను అదే మార్గములో పయనింపజేసేవారు :

కాకతీయనగర సామ్రాజ్యమ్ : అట్టి భారతదేశములో దక్షిణ పథమున శ్రీ పద్మాక్షీ దేవి కృపతో సహస్ర వర్షములు పూర్వము 1158 సిరి సంపదలతో ఓరుగల్లు ఏకశిలానగరముగా కీర్తికెక్కిన కాకతీయుల వైభవ సామ్రాజ్యము కాకతీయనగర మహా సామ్రాజ్యము

కాకతీయనగర సామ్రాజ్యస్థాపనలో , సామ్రాజ్య నిర్మాణములో ముఖ్య కేంద్ర బిందివులు దేవస్థానములు , అది ఏసామ్రాజ్యములైనా రాజులు భగవంతుని సేవకులై ఆ భగవంతుని అనుగ్రహముతో విప్రోత్తములైన వేదవిదుల మార్గదర్శనములో ఏర్పడిన సామ్రాజ్యములు వారి , వాటి కీర్తి అజరామములు అదేవిధముగా స్థాపనలో రాజ్యములో మూల కేంద్రములు దేవస్థానములు , త్రికూట ఆలయాలు వాటిలో ప్రసిద్దమైనవి శ్రీ చతుర్ముఖేశ్వర స్వయంభూ దేవస్థానము , మరియు ఎన్నో ప్రసిద్ధ దేవస్థానాలు ,

అటువంటి మహిమాన్వితమైన సామ్రాజ్యాలు అస్తమయమై నట్లు కనిపించిన అది కేవలము కొంత కాలము మాత్రమే అది సూర్య అస్తమయమువంటిదే, వెంటనే కొంత సమయము తరువాత సూర్యోదయముతో మరలా క్రొత్త దివ్య తేజోభరితమైన నూతన రాజ్యములుగా వెలయుట , తన్మూలకముగా ధర్మ స్థాపన ,ప్రజా రక్షణ ఇది నిరంతర ప్రక్రియ

కాలానుగుణంగా పరిస్థితులు మారవచ్చు; రాజులు మారవచ్చు, రాజవంశాలు మారవచ్చు. కానీ రాజధర్మం ఎన్నటికీ మారదు. సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం, ఆ తరువాత మరల సూర్యోదయం—ఇది ప్రకృతి నిరంతర నియమం. అదే విధంగా ఒక రాజ్యం, సామ్రాజ్యం తన కాలధర్మాన్ని నిర్వర్తించి అస్తమించినా, కాలగర్భం నుండి మరొక నూతన సామ్రాజ్యం దివ్యకాంతులతో ఆవిర్భవిస్తుంది.

రాజ్యాలు మారుతాయి—ధర్మం మారదు. రాజులు మారుతారు—రాజధర్మం మారదు. సామ్రాజ్యాలు అస్తమిస్తాయి—ధర్మసంకల్పం మాత్రం శాశ్వతం.

ప్రకృతి యొక్క మూల నియమాలు, ధర్మసూత్రాలు, శాశ్వత సిద్ధాంతాలు ఎన్నటికీ మారవు. వాటినే ఆధారంగా చేసుకొని యుగయుగాలుగా ధర్మస్థాపన, ప్రజారక్షణ, ప్రజాపాలన, లోకకల్యాణం కోసం నూతన రాజ్యాలు, సామ్రాజ్యాలు ఆవిర్భవిస్తూనే ఉంటాయి. చంద్ర–సూర్య వంశాల నుండి కొనసాగిన రాజధర్మానికి వేదవిదులైన విప్రులు మార్గదర్శకులు; సంస్థానాలు, ఘటికాస్థానాలు దాని ఆధారాలు.

సామ్రాజ్యాలు కాలంతో పుడతాయి, కాలంతో అస్తమిస్తాయి; కానీ ధర్మం మాత్రం కాలాతీతం—శాశ్వతం. కాకతీయులైనా, విజయనగర సామ్రాజ్యమైనా, హొయసలులైనా, మరే ధర్మాధిష్ఠిత సామ్రాజ్యమైనా—వాటి అంతిమ లక్ష్యం ఒక్కటే: ధర్మ పరిరక్షణ, ప్రజాపాలన, సకల ప్రాణుల ఉన్నతి, లోకకల్యాణం.

Preposed Reconstruction of the Ancient Chaturmukha Sri Swayambhoo Devasthanam at a New Location, and Preserving Its Original Form

Preposed Reconstruction of the Ancient Chaturmukha Sri Swayambhoo Devasthanam at a New Location, and Preserving Its Original Form