శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్రం : ఏకశిలా నగరం — ఓరుగల్లు, వరంగల్,
The Birthplace of Sri Vidyaranya: The Monolithic City — Orugallu, Warangal
श्री विद्यारण्य जन्मभूमि क्षेत्र: एकशिलानागरम— ओरुगल्लू, वारंगल
ஸ்ரீ வித்யாரண்ய ஜென்மபூமி க்ஷேத்ரா: ஒற்றைக்கல் நகரம் - ஒருகல்லு, வாரங்கல்


श्रुति स्मृति पुराणानाम् आलयम करुणालयम्। नमामि भगवत्पादम शंकरं लोक शंकरम्॥
अविद्यारण्यकान्तारे भ्रमतां प्राणिनां सदा ।विद्यामार्गोपदेष्टारं विद्यारण्यगुरुं श्रये ॥
विद्याविद्याविवेकेन पारं संसारवारिधेः ।प्रापयत्यनिशं भक्तांस्तं विद्यारण्यमाश्रये ॥
श्रीमती जननी यस्य सुकीर्तिर्मायणः पिता ।सायणो भोगनाथश्च मनोबुद्धी सहोदरौ ॥
यस्य बोधायनं सूत्रं शाखा यस्य च यजुष्मयी ।भारद्वाजकुलं यस्य सर्वज्ञः स हि माधवः ॥



"ఏకశిలా నగరం" "ఓరుగల్లు" నుండి వెలసిన మహామహుడు శ్రీ విద్యారణ్య : శ్రీ విద్యారణ్యుల జీవితాన్ని స్మరించుకునే ప్రతి భారతీయుడికి అత్యంత గర్వకారణమైన విషయం – ఆయన జన్మస్థలం ఏకశిలానగరం ఒరుగల్లు, నేటి వరంగల్ ప్రాంతంతో ఆయనకు ఉన్న అనుబంధం.

ఒరుగల్లు కేవలం ఒక పురాతన నగరం కాదు.అది కాకతీయుల మహాసామ్రాజ్యానికి హృదయం.అది శిల్పకళకు నిలయం.అది దేవాలయ సంస్కృతికి నిలయం.అది వీరత్వానికి ప్రతీక. అది తెలుగు నేల చరిత్రలో ఒక మహోన్నత అధ్యాయం. అటువంటి ఏకశిలానగరంలోనే శ్రీ విద్యారణ్యుల జన్మభూమి , ఆయన జ్ఞాపకాన్ని శాశ్వతంగా నిలబెట్టడం మన బాధ్యత.


శ్రీ విద్యారణ్యులు – ఒక వ్యక్తి కాదు, ఒక యుగధర్మం : శ్రీ విద్యారణ్యుల జీవితాన్ని కేవలం ఒకే కోణమునుండి చూస్తే ఆయన మహిమలో ఒక చిన్న భాగమే మనకు కనిపిస్తుంది.

ఆయనలో – వేదవేత్తను చూస్తే జ్ఞానం వికసిస్తుంది.
వేదాంతిని చూస్తే బ్రహ్మజ్ఞానం కనిపిస్తుంది.
ఆచార్యుని చూస్తే మోక్షమార్గం కనిపిస్తుంది.
రాజగురువును చూస్తే రాజధర్మం కనిపిస్తుంది.
విజయనగర ప్రేరణామూర్తిని చూస్తే సామ్రాజ్య దృష్టి కనిపిస్తుంది.
ధర్మరక్షకుడిని చూస్తే సనాతన భారతం కనిపిస్తుంది.
ఆచార్యుని చూస్తే గురుపరంపర కనిపిస్తుంది.
గ్రంథకర్తను చూస్తే భారతీయ జ్ఞానసంపద కనిపిస్తుంది.
వేదభాష్య పరంపరను చూస్తే శ్రుతి రక్షణ కనిపిస్తుంది.
ఒరుగల్లు ఏకశిలానగరం జన్మభూమిని చూస్తే మన చారిత్రక గౌరవం కనిపిస్తుంది.

అందుకే శ్రీ విద్యారణ్యులు ఒక వ్యక్తి మాత్రమే కాదు
ఒక ఆచార్య పరంపర.
ఒక జ్ఞానజ్యోతి.
ఒక ధర్మశక్తి.
ఒక సాంస్కృతిక పునరుజ్జీవనం.
ఒక యుగధర్మం.

శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్రం – ఏకశిలానగరం ఒరుగల్లులో ఒక మహా సంకల్పం:

  • శ్రీ విద్యారణ్యుల వంటి మహనీయుని జన్మభూమి మరుగునపడకుండా, భవిష్యత్ తరాలకు ఆయన మహిమ, వేదసేవ, ధర్మకార్యం మరియు భారతీయ సంస్కృతికి ఆయన చేసిన సేవలను పరిచయం చేయడం మనందరి బాధ్యత.

ఈ పవిత్ర సంకల్పంలో భాగంగా ఏకశిలానగరం ఒరుగల్లు – వరంగల్‌లో “శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్రం” నిర్మాణానికి సంకల్పం.

ఈ క్షేత్రం కేవలం ఒక క్షేత్రం మాత్రమే కాకుండా వేదానికి నిలయం,
వేదాంతానికి విద్యాపీఠం,
ఆచార్య పరంపరకు స్మారక క్షేత్రం,
సనాతన ధర్మానికి ప్రేరణా కేంద్రం,
భారతీయ సంస్కృతికి జ్ఞానకేంద్రం గా అభివృద్ధి చెందాలన్నదే మా మహాసంకల్పం.

ఈ మహత్తర కార్యం పూజ్య హి.హెచ్. శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ వారి మార్గదర్శకత్వంలో .ఈ పవిత్ర క్షేత్రంలో చతుర్వేద స్వరూపాలైన నాలుగు వేదమూర్తులతో శ్రీ విద్యారణ్యుల మహిమను ప్రతిష్ఠించి, వేదం–వేదాంతం–ధర్మం–సంస్కృతి అనే నాలుగు మహాస్తంభాలపై ఈ క్షేత్రాన్ని నిర్మించాలనే సంకల్పం.


సంకల్పం :

కాలం మారుతుంది. రాజులు మారుతారు. రాజ్యాలు మారుతాయి. సామ్రాజ్యాలు ఉదయిస్తాయి – అస్తమిస్తాయి. కానీ ధర్మం శాశ్వతం. ఒక సూర్యోదయం తరువాత సూర్యాస్తమయం వచ్చినట్లే, కాలచక్రంలో ఒక యుగం ముగిసి మరొక యుగం ఆరంభమవుతుంది. ఏకశిలానగరం ఒరుగల్లులో వెలిగిన కాకతీయ వైభవం, దాని అనంతరం దక్షిణ భారతదేశంలో ధర్మరక్షణకు వెలుగునిచ్చిన విద్యారణ్యుల మహత్తర కార్యం, విజయనగర సామ్రాజ్య ఆవిర్భావం – ఇవన్నీ భారతీయ చరిత్రలో ధర్మజ్యోతి ఎలా ఒక రూపం నుండి మరొక రూపానికి ప్రయాణిస్తుందో తెలియజేసే మహత్తర అధ్యాయాలు.

ఇప్పుడు ఆ మహాజ్ఞాని శ్రీ విద్యారణ్యుల జన్మభూమిని పునరుజ్జీవింపజేయడం మన తరం యొక్క బాధ్యత. ### ఏకశిలానగరం ఒరుగల్లు మళ్లీ విద్యారణ్య జ్ఞానజ్యోతితో వెలుగొందాలి. వేదం వెలగాలి.ధర్మం నిలవాలి. సంస్కృతి వికసించాలి. ఆచార్య పరంపర చిరంజీవిగా ఉండాలి.

శ్రీ విద్యారణ్యుల పాదపద్మాలకు శతకోటి నమస్సుమాంజలులు.

॥ ధర్మో రక్షతి రక్షితః ॥ -॥ వేదో నిత్యమధీయతాం ॥

భారతీయ చరిత్రలో, వేదవేదాంత పరంపరలో, విజయనగర సామ్రాజ్య నిర్మాణంలో మహోన్నత పాత్ర పోషించిన శ్రీ విద్యారణ్య మహర్షి జన్మస్థలం ఏకశిలా నగరం — ఓరుగల్లు (వరంగల్) భూమిని పునరుద్ధరించి, ఆ పవిత్ర స్థలాన్ని ఒక మహత్తర ధర్మ–వేద–సాంస్కృతిక క్షేత్రంగా తీర్చిదిద్దే సంకల్పం 20 సంవత్సరముల క్రిందట( 2006 లో ) భగవంతుని కృపతో , ప్రేరణ తో ప్రారంభము అయినది. క్షేత్ర పునః నిర్మాణం ఇది కేవలం ఒక ఆలయ నిర్మాణం కాదు. ఇది ఒక మహర్షి జన్మభూమికి పునఃగౌరవ ప్రతిష్ఠ. ఇది వేద పరంపర నికి పునరుజ్జీవనం. ఇది 1000  సం ఓరుగల్లు చారిత్రక వైభవానికి పునఃస్మరణ. ఇది భారతీయ ధర్మ సంస్కృతికి ఒక శాశ్వత జ్ఞాన కేంద్ర నిర్మాణం.

శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్రం : ఈ పవిత్ర సంకల్పంలో భాగంగా, వరంగల్‌లో “శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్రం పునః నిర్మాణ  పేరుతో ఒక విశిష్టమైన ఆలయ–వేద కేంద్రాన్ని నిర్మించాలనే ఆలోచన 20 సం || క్రిందట రూపుదిద్దుకున్నది అది ఈ రోజు కార్య రూపమును దాల్చుచున్నది రూపుదిద్దుకుంటోంది.

ఉత్తరామ్నాయ బదరి జ్యోతిర్మఠ , పశ్చిమామ్నాయ ద్వారకా శారదా పీఠ జగద్గురు శంకరాచార్య స్వామి ధర్మసామ్రాట్ బ్రహ్మీభూత శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి దీక్షిత శిష్యులు పరమపూజ్య పరమహంస పరివ్రాజక స్వామి శ్రీ శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ మార్గదర్శనములో ఈ కార్యము వైభవోపేతముగా సంపన్నము కావుట ఆరంభము కావుట ఈ మహత్ కార్య వైశిష్ఠ్యము,

జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య స్వామివారి జన్మస్థలమైన ఏకశిలానగరము ఓరుగల్లులో నిర్మించబోవు శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్ర అధిష్ఠాన మందిరము నిర్మాణమునకై 24 Oct 2016 సం|| లో విశేష సంకల్ప పూర్వకముగా పూజ్య బదరి ద్వారకా జగద్గురువుల శ్రీ శ్రీ శ్రీ స్వరూపానంద సరస్వతి స్వామివారి కరకమల హస్తములచే "శిలా" పూజనము వైభవముగా సంపన్నము అయ్యి , 2026 ప్రస్తుతము ఆ దివ్య కార్యక్రమము సంకల్పంలో భాగముగా శ్రీ విద్యారణ్యులవారికి నిర్మించబోవు అధిష్ఠానం మందిరము లో ప్రతిష్ఠించబోయే పంచధాతు ఉత్సవమూర్తి , శ్రీ విద్యారణ్య పాదుకలకు చరప్రతిష్ఠా, శుభ కార్యక్రమము మరియు వరంగల్‌ లోని అన్ని వైదిక ఐతిహాసిక దేవాలయాలలో పూజ , ఉత్సవ మూర్తికి , పాదుకలకు అభిషేకములు పాదపూజలు,

నాలుగు వేదమూర్తులు — నాలుగు వేదాల సాక్షాత్కార ప్రతీక : ఈ క్షేత్రంలో ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అనే నాలుగు వేదాలకు ప్రతీకలుగా నాలుగు వేదమూర్తులను ప్రతిష్ఠించాలనే సంకల్పం అత్యంత విశిష్టమైనది.

వేదం భారతీయ సంస్కృతికి మూలం: వేదమూర్తుల సన్నిధిలో నిత్య వేదపారాయణం, వేదాధ్యయనం, శాస్త్రచర్చలు, ధార్మిక కార్యక్రమాలు కొనసాగుతూ, ఈ క్షేత్రం భవిష్యత్ తరాలకు వేదం జీవించే ప్రదేశంగా నిలవాలి.

శ్రీ విద్యారణ్య మహర్షి వేదభాష్య సంప్రదాయానికి, వేదాంతజ్ఞానానికి, ధర్మసంస్కృతికి చేసిన మహోన్నత సేవను స్మరించుకుంటూ, ఆయన జన్మభూమిలోనే వేదధ్వని నిత్యం ప్రతిధ్వనించాలనే సంకల్పమే ఈ క్షేత్ర నిర్మాణానికి ప్రేరణ.

ఓరుగల్లు నుండి భారతీయ జ్ఞానపరంపరకు : ఓరుగల్లు కేవలం ఒక ప్రాచీన రాజధాని కాదు. ఇది కాకతీయుల ధర్మసంస్కృతికి, శౌర్యానికి, కళలకు, విద్యకు, దేవాలయ సంప్రదాయానికి సాక్ష్యభూమి. అటువంటి పుణ్యభూమిలో శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్రం నిర్మాణం జరిగితే, అది కాకతీయుల నుండి విజయనగరం వరకు కొనసాగిన ధర్మ–సంస్కృతి ప్రవాహానికి ఒక సజీవ వారధిగా నిలవగలదు.

భవిష్యత్ తరాలకు ఒక శాశ్వత వారసత్వం : ఈ క్షేత్రం భవిష్యత్తులో కేవలం పూజా స్థలంగా కాకుండా

  • వేదాధ్యయన కేంద్రంగా,
  • వేదపారాయణ కేంద్రంగా
  • వేదభాష్య పరిశోధన కేంద్రంగా
  • సంస్కృత–శాస్త్ర విద్యా కేంద్రంగా
  • భారతీయ ధర్మచరిత్ర అధ్యయన కేంద్రంగా
  • ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాల కేంద్రంగా
  • యువతకు భారతీయ జ్ఞానపరంపర పరిచయం చేసే క్షేత్రంగా అభివృద్ధి చెందాలి.

ఒక మహాసంకల్పం : ఒక మహర్షి జన్మించిన భూమిని గుర్తించడం మాత్రమే కాదు— ఆ మహర్షి జీవించిన జ్ఞానసంకల్పాన్ని పునరుజ్జీవింపజేయడం ఈ కార్యం యొక్క నిజమైన లక్ష్యం.

ఓరుగల్లు భూమిలో మళ్లీ వేదఘోష వినిపించాలి. మళ్లీ శాస్త్రచర్చలు జరగాలి. మళ్లీ ధర్మజ్ఞానం తరతరాలకు ప్రవహించాలి.

నాలుగు వేదమూర్తుల సన్నిధిలో, శ్రీ విద్యారణ్య మహర్షి స్మృతితో, పరమపూజ్య శ్రీ గోవిందానంద సరస్వతి స్వామీజీ వారి మార్గదర్శకత్వంలో, “శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్రం” భారతీయ జ్ఞాన–ధర్మ–సంస్కృతి పునరుజ్జీవనానికి ఒక మహాదీపస్తంభంగా వెలుగొందాలి.

సంకల్ప వాక్యం : “శ్రీ విద్యారణ్య జన్మభూమి — వేదానికి నిలయం, ధర్మానికి ఆలయం, జ్ఞానానికి క్షేత్రం, లోకకల్యాణానికి ప్రేరణ.”

1) ఏకశిలానగరం వరంగల్ లో ఒక నెల కార్యక్రమం, ( Sept 2026)
2) జగద్గురు శంకరాచార్య శ్రీ విద్యారణ్య స్వామివారి జన్మస్థలమైన ఏకశిలానగరము వరంగల్ ఓరుగల్లులో "కాకతీయ సంస్థానము" ,
"శ్రీ విద్యారణ్య జన్మభూమి సేవా సమితి" తరపున నిర్మించబోవు
"శ్రీ విద్యారణ్య జన్మభూమి క్షేత్ర" మందిరమునకు, మందిరములో ప్రతిష్ఠించబోయే పంచధాతు ఉత్సవమూర్తి , శ్రీ విద్యారణ్య పాదుకలకు చరప్రతిష్ఠా, కార్యక్రమము
3) వరంగల్‌లోని అన్ని వైదిక, ఐతిహాసిక దేవాలయాలలో విశేష పూజలు అభిషేకములు

More info :


More Info : srividyaranyajanmabhoomi@gmail.com